నారాయణపేట, వెలుగు : మరికల్, నారాయణపేట మధ్య పైప్లైన్ లీకేజీ రిపేర్ కోసం సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకు 24 గంటల పాటు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ జిల్లా అధికారి పుట్ట వెంకట్రెడ్డి తెలిపారు.
దీంతో దేవరకద్ర, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోని దేవరకద్ర, నర్వ, మరికల్, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద మండలాల్లో పూర్తిగా, కౌకుంట్ల, చిన్నచింతకుంట, మక్తల్, ధన్వాడ మండలాల్లో పాక్షికంగా, మక్తల్, నారాయణపేట మున్సిపాలిటీల్లో పూర్తిగా నీటి సరఫరా ఉండదని తెలిపారు.