అవిభక్త కవలలను వేరుచేసిన ఎయిమ్స్ డాక్టర్లు
న్యూఢిల్లీ: పొత్తి కడుపు, వెన్నెముక, పేగులు కలిసిపోయి జన్మించిన అవిభక్త కవలలను ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు వేరు చేశారు. 64 మందితో కూడిన టీమ్ 24గంటల పాటు కష్టపడి ఈ క్లిష్టమైన ఆపరేషన్ ను పూర్తి చేసింది. ఉత్తర్ ప్రదేశ్ లోని బదౌన్ కు చెందిన దంపతులకు అవిభక్త ఆడ కవలలు జన్మించారు. ప్రస్తుతం వారి వయసు రెండేళ్లు. వీరిని ఎయిమ్స్ లో చేర్పించగా శుక్రవారం ఉదయం 8:30 నుంచి శనివారం ఉదయం 9గంటల వరకు ఆపరేషన్ చేసినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. పిల్లలిద్దరికీ గుండెలో రంధ్రం ఉండడంతో ఆపరేషన్ చేయడం మరింత కష్టమైందని పేర్కొన్నారు. కవలలు ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు.
For More News..