
విశాఖపట్నం: స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ. 24 లక్షల జరిమాన పడింది. అలాగే ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. ‘ఈ సీజన్‌లో డీసీ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇది రెండోసారి. అందుకే పంత్‌కు భారీ ఫైన్ విధించారు. ప్లేయర్ల ఖాతా నుంచి రూ. 6 లక్షలు లేదా 25 శాతం కోతలో ఏది తక్కువ అయితే దాన్ని విధిస్తారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పంత్‌పై చర్యలు తీసుకున్నాం. మరోసారి ఇలాంటి తప్పు రిపీట్ అయితే భారీ చర్యలు ఉంటాయి’ అని ఐపీఎల్ పేర్కొంది.