కర్నూలు: కృష్ణా నదిలో వరద పోటెత్తడంతో రాయలసీమలోని కాల్వలు.. ప్రాజెక్టుల కు పోతిరెడ్డిపాడు ద్వారా 24 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం 2 వేల క్యూసెక్కులతో మొదలైన నీటి విడుదల ఇవాళ 24 వేల కు పెరిగింది. కృష్ణా నదిలో వరద మొదలైన తర్వాత.. శ్రీశైలం డ్యామ్ 870 అడుగులకు చేరిన వెంటనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదల మొదలైంది. స్థానిక నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ గేట్లు ఎత్తి నీటి విడుదల ప్రారంభించారు.
తెలుగుగంగ.. బానకచెర్ల మీదుగా.. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలోని ప్రాజెక్టులకు నీటి విడుదల కొనసాగుతోంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో స్థానిక కాలువల్లో వరద మొదలైంది. ఒకింత ఆలస్యంగా నైనా కృష్ణా నది నుండి కూడా నీటి విడుదల ప్రారంభించారు. కృష్ణా బోర్డుకు అధికారిక సమాచారం ఇచ్చిన తర్వాతనే నీటి విడుదల ప్రారంభించామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.