రూ.24.75 లక్షలు, 243 లీటర్ల మద్యం సీజ్

రూ.24.75 లక్షలు, 243 లీటర్ల మద్యం సీజ్

వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వికారాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్  వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 24,75,491 నగదు, 243.68 లీటర్లు మద్యం( సుమారు రూ. 1,15,864  విలువ)  సీజ్ చేసినట్టు ఎస్పీ కోటిరెడ్డి సోమవారం తెలిపారు. జిల్లాలో రూ. 50,000లకు మించి నగదు తీసుకెళ్తే సంబంధించిన పత్రాలు పెట్టుకోవాలని ఆయన సూచించారు.

సరిహద్దు చెక్ పోస్టుల్లో ముమ్మర తనిఖీలు

కొడంగల్ : పార్లమెంట్​ ఎన్నికల సందర్భంగా తెలంగాణ , కర్నాటక సరిహద్దు చెక్​ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. కొడంగల్​పరిధిలోని కస్తూర్​పల్లి, చంద్రకల్​గ్రామాల వద్ద చెక్​పోస్టులు ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేశారు.  అక్రమంగా డబ్బు, మద్యం, గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి కస్తూర్​పల్లి చెక్​ పోస్టు వద్ద రూ. 2.88 లక్షల నగదును సీజ్​చేసినట్టు కొడంగల్​ఎస్​ఐ భరత్​కుమార్​రెడ్డి చెప్పారు.  సోమవారం చంద్రకల్​చెక్​ పోస్టు వద్ద రూ. లక్ష నగదును సీజ్​చేశామని దౌల్తాబాద్​ఎస్​ఐ శ్రీశైలం యాదవ్​ వెల్లడించారు. సరైన ఆధారాలు ఉంటేనే రూ. 50 వేలకు మించి నగదును తీసుకెళ్లాలని ప్రజలకు అధికారులు సూచించారు.