- అంతరాష్ట్ర ముఠా అరెస్టు
జీడిమెట్ల, వెలుగు: ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠాను బాలానగర్ఎస్వోటీ, శామీర్‌పేట్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. నిందితుల నుంచి 2.43 క్వింటాళ్ల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి బుధవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. హర్యానాకు చెందిన భజరంగ్ (23) బోయిన్‌పల్లిలో నివాసం ఉంటూ కార్గో ప్యాకర్స్అండ్మూవర్, నరేశ్(40) సెకండ్ హ్యాండ్ డీలర్‌గా, కపిల్ శర్మ (28) అల్వాల్‌లో ఉంటూ ఇంటర్నెట్షాపు నిర్వహిస్తున్నాడు. రాజస్థాన్‌కు చెందిన గజేందర్సింగ్అలియాస్ గజ్జు (26) న్యూబోయిన్‌పల్లిలో ఉంటూ మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. వీరంతా గ్యాంగ్‌గా ఏర్పడి ఈజీ మనీ కోసం గంజాయి సప్లై చేయాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగా ఒడిశాకు చెందిన శామ్యూయేల్అలియాస్ సుభాష్ వద్ద గంజాయి కొని ఆన్లైన్ పేమెంట్ చేశారు. అనంతరం అనుమానం రాకుండా గూడ్స్వాహనంలో గంజాయిని మహారాష్ట్రలోని రాకేశ్‌కు పంపందేకు ప్లాన్చేశారు. విశ్వసనీయ సమాచారంతో ఈ నెల 3న శామీర్పేట్ఓఆర్ఆర్వద్ద స్టేట్ కార్గో ప్యాకర్స్ అండ్మూవర్స్బొలేరో వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా, రూ. 95.75 లక్షల విలువ చేసే 243 కిలోల గంజాయి పట్టుబడింది.
దీంతో వాహనంలోని నిందితులు భజరంగ్, గజేంద్రసింగ్, నరేశ్ చింగ్లా, కపిల్శర్మను అరెస్టు చేసి, 10 సెల్ ఫోన్స్స్వాధీనం చేసుకున్నారు. కాగా, గతంలో డ్రగ్స్‌కేసులో పదేండ్ల శిక్షపడ్డ బలరామ్ అనే వ్యక్తిజైలుకు వెళ్తూ ఆయన ఫోన్‌ను తనకు ఇవ్వడంతో.. అందులోని కాంటాక్ట్స్ఆధారంగా గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో భజరంగ్ తెలిపాడు. ప్రస్తుతం రాకేశ్, సుభాష్‌లు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు.