244 సెంటర్లలో ఇంటర్​ ఎగ్జామ్స్

244 సెంటర్లలో ఇంటర్​ ఎగ్జామ్స్
  • హాజరుకానున్న 1,79,218 మంది స్టూడెంట్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చే నెల 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్​ఫస్ట్, సెకండ్​ఇయర్​ఎగ్జామ్స్ కు ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్​జిల్లా రెవెన్యూ అధికారి ఈ.వెంకటాచారి అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో కోఆర్డినేషన్​మీటింగ్​నిర్వహించారు. 

మొత్తం 244 ఎగ్జామ్​సెంటర్లలో 1,79,218 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్​రాయనున్నారని తెలిపారు. వీరిలో ఫస్ట్​ఇయర్ స్టూడెంట్లు 85,753 మంది, సెకండ్​ఇయర్​స్టూడెంట్లు 93,465 మంది ఉన్నారని వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 

ప్రశ్నాపత్రాల తరలింపులో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో సీల్​వేయడం, తీయడం జరుగుతుందన్నారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేసేలా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డి.ఒడ్డెన్న, ఏసీపీ భాస్కర్, ఆర్ఎం బాబూనాయక్, జిల్లా వైద్య అధికారి జె.వెంకటి, పోస్టల్ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.