- ఎల్లుండితో ముగియనున్న దరఖాస్తు గడువు
హైదరాబాద్, వెలుగు: మెగా డీఎస్సీకి అప్లికేషన్ల ప్రక్రియ మరో మూడు రోజుల్లో ముగియనున్నది. సోమవారం సాయంత్రం వరకు 2,45,135 మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చేనెల 17 నుంచి డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. స్టేట్ వైడ్గా 11వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఫిబ్రవరి 29న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 4న ప్రారంభమైన అప్లికేషన్ల ప్రక్రియ జూన్ 20 వరకు కొనసాగనున్నది. ఈ నెల 19 వరకే ఫీజు చెల్లించే అవకాశం ఉంది. అయితే, డీఎస్సీ 2023 కోసం దరఖాస్తు చేసిన 1,71,347 మంది.. మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. దీంతో సోమవారం సాయంత్రం నాటికి కొత్తగా 73,788 మంది అప్లై చేసుకున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకు మొత్తం 2,51,581 మంది ఫీజు చెల్లించగా, వారిలో 2.45 లక్షల మంది దరఖాస్తు చేశారు. కాగా, టెట్ ఫలితాల నేపథ్యంలో డీఎస్సీ అప్లికేషన్లకు విద్యాశాఖ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఇప్పటి వరకు 50వేల మంది తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకున్నారు.