తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 24గంటలు..

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి సర్వదర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లలో భక్తు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంటులన్నీ నిండిపోవడంతో వెలుపల కూడా క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.

గురువారం ( సెప్టెంబర్ 19, 2024 ) 72,158 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా... 25,883 మంది తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 4.96 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.