జీహెచ్ఎంసీ ప్రజావాణికి 25 ఫిర్యాదులు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సోమవారం ప్రజావాణికి 25 ఫిర్యాదులు వచ్చాయి. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కమిషనర్ ఆమ్రపాలి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో టౌన్ ప్లానింగ్ 11, రెవెన్యూ 6, అడ్మిన్ 2,  ఎల్ డబ్ల్యూ ఎస్ 2, లేక్స్ 2, ఇంజనీరింగ్ విభాగానికి 2  వచ్చాయి. టెలిఫోన్ ద్వారా 4  అందాయి. కూకట్ పల్లి జోన్ 12, సికింద్రాబాద్ జోన్ 10, ఎల్ బీనగర్ జోన్ 4, చార్మినార్ జోన్ 2,  ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్ 1 చొప్పున  వచ్చాయి. అర్జీల్లో జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు డిప్యూటీ మేయర్, కమిషనర్ సూచించారు. అడిషనల్ కమిషనర్లు సత్యనారాయణ, యాదగిరి రావు నళిని పద్మావతి సీసీపీ శ్రీనివాస్, అడిషనల్ సీసీపీ గంగాధర్, ఆయా విభాగాల వాల్యూయేషన్ అధికారి మహేశ్​ కులకర్ణి పాల్గొన్నారు.

కలెక్టరేట్ లో 52  అప్లికేషన్లు  

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కదిరవన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో నిర్వహించిన ప్రజావాణిలో 52 దరఖాస్తులు వచ్చాయి. గృహ నిర్మాణ శాఖ 26, పింఛన్లు11, భూ సమస్యలు 4, ఇతర సమస్యలపై11 అందాయి. లా ఆఫీసర్ వీరబ్రహ్మ చారి, జిల్లా అధికారులు షఫీ మియా,  పెరిక యాదయ్య , ఆర్ కోటజీ, ఇలియాజ్ అహ్మద్, ఎల్ఎండీ. సుబ్రహ్మణ్యం, జీఎం ఇండస్ట్రీస్ పవన్ కుమార్, సీపీఓ డాక్టర్ సురేందర్, వయోజన విద్య డీడీ జయశంకర్, ఏవో సదానందం,తహసీల్దార్లు పాల్గొన్నారు.

వికారాబాద్: జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణికి ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినట్టు అడిషనల్ కలెక్టర్  లింగ్యా నాయక్ తెలిపారు. రెవెన్యూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. రుణ మాఫీ పై వచ్చిన దరఖాస్తులను వ్యవసాయ అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.