రెండున్నర కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

కుత్బుల్లాపూర్ లో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాలానగర్, కొంపల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని.. రిమాండ్ కు తరలించారు. 
 
నిందితుల్లో శక్తి సోమరాజు(28) అనే వ్యక్తి యాక్టివాపై విక్రయిస్తున్న రెండున్నర కేజీల గంజాయి.. సాయి మనీష్ గౌడ్, నవీన్ అనే ఇద్దరు యువకుల దగ్గర 35 LSD టాబ్లెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ALSO READ :- మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి: సీపీఐ నారాయణ