
సికింద్రాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. తల్లి చనిపోయిందని ఊరికి వెళ్లి కార్యక్రమలు పూర్తి చేసుకుని మళ్లీ బోయిన్పల్లిలోని ఇంటికి వచ్చే సరికి ఇంట్లో ఉన్న బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. సీసీ కెమెరాల్లో ముగ్గురు యువకులు ఇంట్లోకి ప్రవేశించి నగదు,డబ్బుతో పారిపోతున్న దృశ్యాలు రికార్డు కావడంతో బాధితుడు అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్టేషన్ పరిధిలో నివాసం ఉండే అంజిరెడ్డి.. ఆయన తల్లి చనిపోవడంతో కొన్ని రోజుల క్రితం సొంతూరు మెదక్కు వెళ్ళాడు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయంటూ పక్కింటి వారు ఫోన్ చేయడంతో వెంటనే ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో బీరువాలో ఉండవలసిన 25 తులాల బంగారంతో పాటు వెండి, డబ్బు కనిపించలేదు.
ALSO READ : హైదరాబాద్లో ఇసోంటోళ్లు కూడా ఉన్నరు.. పోలీసులమని బండి ఆపి.. ఐదు లక్షలకు దెబ్బేశారు..!
దీంతో వెంటనే బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం సహాయంతో ఆధారలు సేకరించడంతో పాటు సీసీ కెమెరాల్లో దొంగలు వచ్చిన వీడియోలు రికార్డు అయ్యాయి. ఆ వీడియోల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.