- స్కూటీ డిక్కీలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
నందిపేట, వెలుగు: నందిపేట మండలం వెల్మల్ చౌరస్తాలో ఆదివారం ఉదయం పోలీసులు రెండున్నర కిలోల గంజాయిని పట్టుకున్నారు. రూరల్‌సీఐ శ్రీధర్‌రెడ్డి సాయంత్రం పోలీస్టేషన్ లో ప్రెస్మీట్ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. నందిపేట మండలంలో గంజాయి సరపరా జోరుగా జరుగుతుందనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి వారం రోజులుగా గంజాయి సరపరాపై నిఘా పెట్టారు.
ఆదివారం నందిపేట మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు గంజాయి సరపరా అయితుందన్న పక్కా సమాచారం మేరకు ఉదయం వెల్మల్చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేపట్టారు. 10 గంటల సమయంలో నిజామాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్ షేక్అప్రోజ్, పెయింటర్షేక్ మహబూబ్స్కూటీపై వస్తుండగా వారి వాహనం తనిఖీ చేయగా.. స్కూటీ డిక్కీలో రెండున్నర కిలోల గంజాయి లభించింది. నిందితుల నుంచి గంజాయి, స్కూటీతో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఫోన్కాల్స్ఆధారంగా వారిని విచారించగా.. మండలంలోని పలువురు యువకులు, విద్యార్థులకు గంజాయి సప్లయ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నారని సీఐ తెలిపారు. వారి వివరాల ప్రకారం మండలంలోని చాలా మంది యువకులు గంజాయికి బానిసలైనట్లు తెలుస్తోందన్నారు. యువకులు మాదకద్రవ్యాల జోలికి పోవద్దని, విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సీఐ కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్ఐ చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు.