బోధన్​ పట్టణంలోని లయన్స్​కంటి ఆస్పత్రికి రూ.25లక్షల విరాళం

బోధన్, వెలుగు : బోధన్​ పట్టణంలోని లయన్స్​కంటి ఆస్పత్రి అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే కందూల వెంకటేశ్వరరెడ్డి మనుమడు కందూల ప్రభురెడ్డి-అనుపమ దంపతులు గురువారం లయన్స్​ బసవేశ్వరరావుకు రూ.25లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్​కంటి ఆస్పత్రి కోసం కందూల వెంకటేశ్వరరావు కుటుంబం నుంచి ఇప్పటివరకు రూ.68లక్షలు విరాళంగా వచ్చాయన్నారు. 

ప్రస్తుతం ఇచ్చిన రూ.25 లక్షలను షుగర్​ పేషంట్ల కోసం ప్రత్యేక యూనిట్​ ఏర్పాటు చేసి చికిత్స అందించేందుకు వినియోగిస్తామన్నారు.  ఈ సందర్భంగా ప్రభురెడ్డి అనుపమ దంపతులను లయన్స్​ క్లబ్​సభ్యులు అభినందించారు.  కార్యక్రమంలో లయన్స్​ప్రతినిధులు కొడాలి కిషోర్​, నాగేశ్వరావు పాల్గొన్నారు.