కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లల మృతి

కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లల మృతి

వనపర్తి, వెలుగు : వనపర్తి మండలం కిష్టగిరి గ్రామంలో వీధి కుక్కలు దాడి చేయడంతో 25 గొర్రె పిల్లలు చనిపోయాయి. గ్రామానికి చెందిన నక్క మూసన్న తన గొర్రెలను మేపుకుని వచ్చి గ్రామ శివారులోని పొలం వద్ద కట్టేశారు. సోమవారం ఉదయం రెండు వీధి కుక్కలు కొట్టంలోకి వచ్చి గొర్రె పిల్లలపై దాడి చేశాయి.

దీంతో 25 గొర్రె పిల్లలు చనిపోయాయని, వాటి విలువ రూ. 2 లక్షల వరకు ఉంటుందని బాధితుడు మూసన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ఆఫీసర్లు స్పందించి ప్రభుత్వపరంగా నష్ట పరిహారం అందించాలని కోరారు.