మహారాష్ట్ర రాయ్‌ఘడ్‌లోని ఖోపోలీ ప్రాంతంలో ఏప్రిల్ 15 శనివారం రోజు తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాలువలో పడిపోవడంతో 12 మంది మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 నుంచి 45 మంది ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ అధికారులు సహాయక చర్యలు ఫ్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. బస్సులోని ప్రయాణికులు గోరేగాం ప్రాంతానికి చెందినవారుగా తెలుస్తోంది. పూణేలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి స్వస్థలానికి బస్సులో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు పడిన కాలువ లోతు దాదాపు 500 అడుగులు ఉంటుందని తెలుస్తుంది. పల్టీలు కొట్టుకుంటూ బస్సు కాలువలోకి వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని గర్‌శంకర్ ప్రాంతంలో ఏప్రిల్ 14 శుక్రవారం రోజున ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి.