ఎమ్మెల్సీ ఎన్నికలకు 25 నామినేషన్లు

ఎమ్మెల్సీ ఎన్నికలకు 25 నామినేషన్లు

కరీంనగర్‌ టౌన్‌/నల్గొండ, వెలుగు : గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలుకు గురువారం మొత్తం 25 నామినేషన్లు వచ్చాయి. కరీంనగర్‌లో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ కోసం 14 మంది 18 నామినేషన్లు సమర్పించగా, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు నలుగురు క్యాండిడేట్లు తమ నామినేషన్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలాసత్పతికి అందజేశారు. ఈ రెండు ఎన్నికలకు ఇప్పటివరకు మొత్తం 31 మంది 42 నామినేషన్లు సమర్పించారు. 

ఇందులో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ  కోసం 23 మంది 31 సెట్లు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు తొమ్మిది మంది 11 సెట్ల నామినేషన్లు వేశారు. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఇలా త్రిపాఠి అందజేశారు. ప్రజావాణి పార్టీ తరఫున లింగిడి వెంకటేశ్వర్లు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారని, ఇండిపెండెంట్లుగా అర్వ స్వాతి, చాలిక చంద్రశేఖర్‌ నామినేషన్‌ వేశారు.