ఎంత ఘోరం : చూస్తుండగానే ఏసీ బస్సులో.. 25 మంది స్కూల్ పిల్లలు చనిపోయారు

ఎంత ఘోరం : చూస్తుండగానే ఏసీ బస్సులో.. 25 మంది స్కూల్ పిల్లలు చనిపోయారు

ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్లుగానే.. కళ్ల ముందు.. నడి రోడ్డుపై.. ఓ ఏసీలో బస్సులో మంటలు రావటం.. ఆ వెంటనే అందులో 25 మంది స్కూల్ పిల్లలు సజీవ దహనం కావటం నిమిషాల్లోనే జరిగింది. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాంక్ నడిబొడ్డున.. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘోరం ప్రపంచాన్ని కలిచివేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

థాయ్ లాండ్ దేశం బ్యాంకాంక్ సిటీ శివార్లలోని ఉథాయ్ థాని అనే ఊరు ఉంది. అక్కడ ఖావోఫాయా స్కూల్ ఉంది. ఆ స్కూల్ యాజమాన్యం.. పిల్లల కోసం విహార యాత్ర ఏర్పాటు చేసింది. దీని కోసం 44 మంది పిల్లలతో.. ఓ ఏసీ బస్సు ఏర్పాటు చేసింది. అందరూ 7, 8వ తరగతి చదువుతున్న పిల్లలే.. వీళ్లందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా.. కేరింతలు కొడుతూ బస్సు ఎక్కారు.

ఉదయం 9 గంటలకు స్కూల్ నుంచి బయలుదేరిన బస్సు.. బ్యాంకాంక్ ఉత్తర ప్రాంతం అయిన పాతుంథాని ప్రాంతానికి చేరుకుంది. ఇదే సమయంలో బస్సు డ్రైవర్ అదుపు తప్పాడు. రోడ్డు పక్కన ఉన్న పెద్ద డివైడర్ ను బస్సు ఢీకొన్నది. ఆ వెంటనే మంటలు వచ్చాయి. ఏసీ బస్సు కావటంతో.. మంటలు వెంటనే బస్సు అంతా వ్యాపించాయి. బస్సులోని 44 మంది పిల్లలను రక్షించటానికి బస్సు, స్కూల్ సిబ్బంది ఎంతో ప్రయత్నించారు. 19 మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగతా 25 మంది పిల్లల బస్సు మంటల్లో సజీవ దహనం అయ్యారు.

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీస్, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు ఆ దేశ మంత్రి. 

ఇంటి దగ్గర నుంచి విహారయాత్రకు ఎంతో ఆనందంగా వెళ్లిన పిల్లలు.. ఇక తిరిగి రాని లోకానికి వెళ్లారనే విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కన్నీటి పర్యంతం అయ్యారు. ఒకేసారి 25 మంది పిల్లలు ఘోరంగా చనిపోవటం థాయ్ లాండ్ దేశంలో విషాధాన్ని నింపింది.