
న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ డా. రెడ్డీస్ లాబొరేటరీస్ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా 25 శాతం మంది ఉద్యోగులను తీసేయనుందని బిజినెస్ స్టాండర్డ్స్ రిపోర్ట్ చేసింది. ఏడాదికి సుమారు రూ. కోటి జీతం అందుకుంటున్న ఉద్యోగులను రాజీనామా చేయాలని కంపెనీ అడిగిందని, అలానే 50–55 ఏళ్ల వయస్సు గల ఆర్ అండ్ డీ సిబ్బందికి ‘స్వచ్ఛంద పదవీ విరమణ’ను ఆఫర్ చేసిందని పేర్కొంది. డాక్టర్ రెడ్డీస్ మాత్రం ఈ వార్తలను ఖండించింది.