ట్రేడ్ ​లైసెన్సుల రెన్యువల్​పై 25 శాతం పెనాల్టీ

ట్రేడ్ ​లైసెన్సుల రెన్యువల్​పై 25 శాతం పెనాల్టీ

హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్​పరిధిలోని వ్యాపారులు యేటా ట్రేడ్ లైసెన్సులను జనవరిలో నెలలో రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు తర్వాత రెన్యువల్ చేసుకునేవారు 25 శాతం జరిమానతో చెల్లించాలి. గతేడాది 11లక్షల11వేల మంది వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ లు పొందారు. వీరి నుంచి జీహెచ్ఎంసీకి రూ.67 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది వీరంతా రెన్యువల్​చేసుకోవాలి. 

వీరితోపాటు కొత్తగా తీసుకునేవారు ఉంటారు. అయితే జనవరిలో మొత్తం 63,500 మంది వ్యాపారులు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ లు పొందారు. ఇప్పటికే రూ.67 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలినవారు ఫిబ్రవరి, మార్చిలోపు రెన్యువల్ చేసుకుంటే 25 శాతం,  ఆ తరువాత అయితే  50 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.