కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి 

కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి 

పాలకుర్తి, వెలుగు: కుక్కల దాడిలో ఇరువై ఐదు గొర్రెలు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన జోగు అశోక్ ఇంటి వద్ద ఉన్న దొడ్డిలో గొర్రెల మంద ఉంచగా, మంగళవారం తెల్లవారు జామున కుక్కలు దాడిచేసి 25 గొర్రెలను చంపేయగా, మరో ఐదు గొర్రెలకు తీవ్రగాయాలయ్యాయి. వీటి విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు, కుటుంబ సభ్యులు కోరారు.