పిడుగుపాటుతో 25గొర్రెలు మృతి

ధర్మసాగర్, వెలుగు : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురంలో మంగళవారం అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో పిడుగుపాటుతో 25గొర్రెలు చనిపోయాయి. ధర్మపురానికి మేకల సదయ్య గొర్రెలు కాస్తూ బతుకుతున్నాడు. వీటికోసం ఇంటి ఆవరణలో ఒక షెడ్డు నిర్మించాడు.   

మంగళవారం రాత్రి 2గంటలకు పిడుగు పడడంతో  గొర్రెలు చనిపోయాయని, ప్రభుత్వ తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నాడు.  

ALSO READ :కేంద్రం నుంచి నిధులు తెస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తాం : ముత్తిరెడ్డి