బావర్చి రెస్టారెంట్​కు 25 వేల జరిమానా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆదిలాబాద్​పట్టణం అంబేద్కర్​ చౌక్​వద్ద ఉన్న బావర్చి రెస్టారెంట్​కు ఫుడ్​ సేఫ్టీ అధికారులు రూ.25 వేల జరిమానా విధించారు. రెస్టారెంట్ ​యాజమాన్యం శానిటేషన్, ఫుడ్​ విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఫిర్యాదుతో రెస్టారెంట్​లో మంగళవారం తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఫుడ్​ సేఫ్టీ అధికారి డా.శ్రీధర్​తెలిపారు. 

మున్సిపల్ అధికారులతో కలిసి రెస్టారెంట్​లోని కిచెన్ సెక్షన్​ను, పలు రికార్డులను తనిఖీ చేశారు. శానిటేషన్ విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం పట్ల జరిమానా విధించామన్నారు. నాలుగు రకాల ఆహార శాంపుల్స్​ని హైదరాబాద్​కు టెస్టుకు పంపించినట్లు తెలిపారు. ఆ టెస్ట్ ఫలితాలు రాగానే శాఖా పరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. తనిఖీల్లో సానిటరీ ఇన్​స్పెక్టర్​ నరేందర్, అధికారులు ఉన్నారు.