
తిమ్మాపూర్, వెలుగు: స్కూళ్లు రీఓపెన్ కావడంతో కరీంనగర్‌లో బుధవారం చేపట్టిన తనిఖీల్లో 25 వాహనాలు సీజ్ చేసినట్లు డీటీసీ పెద్ది పురుషోత్తం తెలిపారు. రవాణా శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి 7 స్కూల్ బస్సులతోపాటు మరో 18 ఇతర వాహనాలపై కేసులు నమోదు చేశారు. అనంతరం పట్టుబడిన వాహనాలను ఆర్టీవో ఆఫీస్‌కు తరలించారు. డీటీసీ మాట్లాడుతూ స్కూల్ మేనేజ్‌మెంట్లు డ్రైవర్ల నియామకంలో నిబంధనలు పాటించాలన్నారు. తనిఖీల్లో ఎంవీఐ రవీందర్, ఏఎంవీఐలు అభిలాశ్, స్రవంతి, సిబ్బంది పాల్గొన్నారు.