కేసీఆర్ మీటింగ్​కు వస్తే రూ.250.. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతల ఆఫర్

కేసీఆర్ మీటింగ్​కు వస్తే రూ.250.. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతల ఆఫర్
  • ఎలక్షన్​ స్క్వాడ్​కు ప్రతిపక్షాల ఫిర్యాదు

పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని భట్టుపల్లిలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ మీటింగ్​కు వచ్చే వారికి బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా ఆఫర్ ప్రకటించారు. మీటింగ్ హాజరయ్యే ఒక్కొక్కరికి రూ.250 ఇస్తామని పర్వతగిరి మండలం దౌలత్ నగర్, బాజు తండా బీఆర్ఎస్ పార్టీ ఇన్​చార్జ్ పేరుతో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. దీంతో దౌలత్ నగర్​కు చెందిన ఇతర పార్టీల నాయకులు సోషల్ మీడియా పోస్ట్ కు సంబంధించి స్క్రీన్ షాట్, గ్రూప్ అడ్మిని స్క్రీన్ షాట్, బీఆర్ఎస్ ఇన్​చార్జ్ ఫొటోతో కూడిన పోస్టింగ్ ను సెండ్ చేసి వర్ధన్నపేట ఎలక్షన్ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చారు.

రంగంలోకి దిగిన ఆఫీసర్లు ఎంక్వయిరీ నిర్వహించారు. పర్వతగిరి పోలీసులకు ఆధారాలు ఇచ్చి కేసు నమోదు చేయాల్సిందిగా సూచించినట్లు స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ ఇమ్మడిశెట్టి సురేశ్ తెలిపారు. వర్ధన్నపేట ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు దౌలత్ నగర్ శివారు బాజీతండాకి చెందిన మలోత్ మున్యా మెసేజ్ ఫార్వర్డ్ చేసిన అతని కొడుకు మాలోత్ నవీన్ , గ్రూప్ అడ్మిన్​లు మాలోతు రాజు, మాలోత్ సుమన్ పై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు పర్వతగిరి ఎస్సై వీరభద్రారావు పేర్కొన్నారు.