- బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: డ్రగ్స్ కేసుల్లో జైల్లో మగ్గుతున్న 2,500 మంది ఖైదీలకు శిక్షను తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ శుక్రవారం ప్రకటించారు. ‘‘కొకైన్, డ్రగ్స్‌కు సంబంధించిన నేరాల్లో జైలుపాలై దీర్ఘకాలికంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఉపశమనం కలగనుంది. వాళ్ల కుటుంబంతో కలిసి ఉండే అవకాశం కలగనుంది” అని బైడెన్ ఆఫీస్ పేర్కొంది. పదవీకాలం ముగుస్తుండటంతో శిక్షా కాలం తగ్గింపు, క్షమాభిక్ష అధికారాలను బైడెన్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. గత నెలలో ఒకేసారి 1,500 మంది ఖైదీల శిక్షా కాలాన్ని తగ్గించారు. మరణశిక్ష పడిన 37 మంది అమెరికన్ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు.