
అమరావతి: ఏపీలో ఇప్పటివరకు 252 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ కోసం ఇంజక్షన్లు అందుబాటులోకి తెస్తున్నామన్న ఆయన..బ్లాక్ ఫంగస్ రోగుల కోసం 3 వేల డోసుల ఇంజక్షన్లను జిల్లాలకు పంపించామని చెప్పారు. ఏపీలో బ్లాక్ ఫంగస్ మరణాలపై ఇప్పటి వరకు సమాచారంలేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో రెమ్ డిసివిర్ కొరత లేదని తెలిపారు. అటు ఆనందయ్య మందుపై ప్రభుత్వం త్వరలోనే తీసుకుంటుందని తెలిపారు అనిల్ సింఘాల్.