జీపీ ఎన్నికలకు 2576 పోలింగ్​ కేంద్రాలు

జనగామ అర్బన్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్​స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12వ తేదీలోగా తెలపాలని కలెక్టర్, జిల్లా ఎలక్షన్​ ఆఫీసర్ రిజ్వాన్​బాషా షేక్ రాజకీయ పార్టీలకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్​ పింకేశ్​కుమార్ తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మొత్తం 283 గ్రామ పంచాయతీలు, 2576 వార్డులు ఉండగా, 2576 పోలింగ్​ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామన్నారు. ఈ జాబితాపై 12వ తేదీలోగా అభ్యంతరాలు తెలుపవచ్చని చెప్పారు. తుది ఓటరు జాబితాను 2024 డిసెంబర్​30న ప్రచురించనున్నట్లు రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆయన తెలిపారు. అంతకుముందు జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్​స్కూళ్లకు సంబంధించిన అధికారులు, డీఎంహెచ్​వో, డీడబ్ల్యూవో, మున్సిపల్​తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

జిల్లాలో మొత్తం 66 రెసిడెన్షియల్​స్కూళ్లలో 12,940 మంది విద్యార్దులు చదువుతున్నారని, హెల్త్​క్యాంపులు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. వసతి గృహాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు.  అనంతరం జూనియర్, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్​కాలేజీల్లో చదువుతున్న మొత్తం 9500 మంది ఇంటర్​విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు.