అత్తాపూర్లో రెండున్నర కేజీల గంజాయి పట్టివేత

అత్తాపూర్లో రెండున్నర కేజీల గంజాయి పట్టివేత

రంగారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా గంజాయి అక్రమ రవాణా యధేచ్చగా జరుగుతోంది. పోలీసుల కళ్లుగప్పి సరిహద్దు రాష్ట్రాలనుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు.శనివారం (ఫిబ్రవరి 8) బీదర్ నుంచి హైదరాబాద్ నగరానికి కారులో గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 

కర్ణాటకలోని బీదర్ నుంచి హైదరాబాద్ నగరానికి అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా అత్తాపూర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.  కారులో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారివద్ద 2.5 కిలోల గంజాయితోపాటు 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.