బాల్కొండ, వెలుగు : బాల్కొండ మండలంలోని వన్నెల్(బి) శ్రీ వేంకటేశ్వర స్వామి 25వ వార్షికోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల కోసం గ్రామాభివృద్ధి
ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. 19న వేంకటేశ్వరుడి కల్యాణ ఉత్సవం ఉంటుందని ఆలయ పురోహితుడు అనీల్ శర్మ తెలిపారు.