చిరు ధాన్యాల్లోనే పుష్కలంగా పోషకాలు

  • ఘనంగా 25వ పాత పంటల జాతర 

న్యాల్ కల్, వెలుగు:  చిరు ధాన్యాల్లోనే పుష్కలంగా పోషక విలువలు ఉంటాయని, ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ డి. ప్రసాద్ రావు, సీనియర్ జర్నలిస్ట్ పతంగి రాంబాబు, రైతు స్వరాజ్ వేదిక, సామాజిక కార్యకర్త ఉష సీతా లక్ష్మి  అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, వడ్డీ గ్రామంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) ఆధ్వర్యంలో 25వ పాత పంటల జాతర  ప్రారంభించారు.

కార్యక్రమంలో స్థానిక శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయ్ కుమార్, జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు, ఎంపీడీఓ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.