ఆ 26 బీసీ కులాలను అన్యాయంగా తొలగించారు : ఆళ్ల రామకృష్ణ

ఆ 26 బీసీ కులాలను అన్యాయంగా తొలగించారు : ఆళ్ల రామకృష్ణ

బషీర్​బాగ్, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో బీసీలుగా ఉన్న 26 కులాలను తెలంగాణ ఏర్పడ్డాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  అన్యాయంగా తొలగించారని 26 కులాల పోరాట సమితి అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను గత బీఆర్ఎస్  ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు. కేసీఆర్  జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్  హయాంలో జరిగిన అక్రమాలను ప్లకార్డులపై రాసి హైదరాబాద్  బషీర్ బాగ్  ప్రెస్ క్లబ్ లో నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ... కేసీఆర్ జన్మదినం తెలంగాణకు దుర్దినమన్నారు. రాష్ట్రం విడిపోతే బీసీలు ఓసీలవుతారా అంటూ కేసీఆర్ ని ఆయన ప్రశ్నించారు. నాటి బీఆర్ఎస్  సర్కారు ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ భవిష్యత్తును తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. ఆ సర్కారు తొలగించిన 26 కులాలను బీసీల్లో కలుపుతామని కాంగ్రెస్  ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఆ హామీని కాంగ్రెస్  ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.