Naxalites surrender: ఛత్తీస్గఢ్లో 26 మంది మావోయిస్టుల లొంగుబాటు

Naxalites surrender: ఛత్తీస్గఢ్లో 26 మంది మావోయిస్టుల లొంగుబాటు

చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చత్తీస్ గఢ్ లోని దంతెవాడలో 26మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి ప్రతిజ్ణ చేసిన విషయం తెలిసిందే..మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఛత్తీస్ గఢ్,తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా భద్రతా బలగాలతో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఎదురు కాల్పుల్లో అనేకమంది మావోయిస్టులు చనిపోయారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువరు మావోయిస్టులు లొంగిపోయారు. తాజాగా ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో 26మంది మావోయిస్టులు లొంగిపోయారు. నక్సల్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం, భద్రతా బలగాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ పక్క కూంబింగ్ నిర్వహిస్తూనే మావోయిస్టులకు పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది.