తెలంగాణలో 26 కొత్త బీర్ల బ్రాండ్లు!

 తెలంగాణలో 26 కొత్త బీర్ల బ్రాండ్లు!

తెలంగాణలో కొత్త బీర్ల బ్రాండ్లపై ఎక్సైజ్ అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. రాష్ట్రంలో బీర్ల కొరత ఉండటంతో సోమ్ కంపెనీతో పాటు మరో నాలుగు కంపెనీలు ముందుకొచ్చినట్టు చెప్తున్నారు. ఈ ఐదు కంపెనీలు 26 బ్రాండ్లను సప్లై చేస్తాయని.. తెలంగాణ ఈ కంపెనీల ప్రొడక్షన్ ఉండదని క్లారిటీ ఇస్తున్నారు. 

బీర్ల సప్లైలో యూబీ కంపెనీదే మెజారిటీ వాట. గత సర్కార్ యూబీ కంపెనీకి 450 కోట్లు పెండింగ్ పెట్టిందని, అందుకే బీర్ల సప్లైని ఆ కంపెనీ తగ్గించింది. బీర్ల కొరత విషయం తెలుసుకొని ఐదు కంపెనీలు సప్లైకి ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకే బీర్ల సరఫరాకు కంపెనీలు అంగీకరించినట్టు చెప్తున్నారు ఎక్సైజ్ అధికారులు.