- తెలంగాణ శకటానికి దక్కని చాన్స్
న్యూఢిల్లీ, వెలుగు: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించే పరేడ్‌లో 26 శకటాలను ప్రదర్శించనున్నారు. ‘‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’’అనే థీమ్‌తో కర్తవ్యపథ్‌లో జరిగే 76 వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలు, కేంద్రప్రభుత్వానికి చెందిన 10 మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించనున్నారు.
ఈ సారి తెలంగాణ శకటానికి రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే అవకాశం దక్కలేదు. రాష్ట్ర శకట నమునా కేంద్ర రక్షణ శాఖ అధికారులను మెప్పించలేకపోయింది. అయితే, పొరుగు రాష్ట్రమైన ఏపీ శకటానికి పరేడ్‌లో చోటు లభించింది.