తెలంగాణ పోలీసులకు.. కేంద్ర అవార్డులు

తెలంగాణ పోలీసులకు.. కేంద్ర అవార్డులు
  • మొత్తం 463 మందికి అవార్డులు ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాదికిగానూ ‘దక్షతా పదక్’ అవార్డులను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 463 మంది పోలీస్ సిబ్బందికి అవార్డులు ప్రకటించగా..అందులో  తెలంగాణ నుంచి 26 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. 

తెలంగాణ నుంచి ఎంపికైన వారిలో పలు ఆపరేషన్స్ చేపట్టిన సీఐ చేగురి సుదర్శన్ రెడ్డి, ఏఆర్ సబ్ ఇన్ స్పెక్టర్ మహ్మద్ ముజీబ్, హెడ్ కానిస్టేబుళ్లు మోహన్ రెడ్డి, పండరి రవిందర్, కానిస్టేబుళ్లు రాంచంద్ర రెడ్డి, ఎం. నాగరాజు, పి. రాజేందర్, కె.శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. 

వీరితో పాటు  ఏప్రిల్6 న పలు ఆపరేషన్స్ చేపట్టిన గ్రూప్ కమాండర్ జె.రాఘవేంద్ర రెడ్డి, సీనియర్ కమాండోలు తిప్పని రాకేశ్, యూ. మల్లయ్య, జూనియర్ కమాండో గంట సాయి కుమార్ కు అవార్డు లు దక్కాయి. 

అలాగే..పలు ఆపరేషన్స్ నిర్వహించిన ఎస్పీ భాస్కరన్, సీఐలు బీసం హరి ప్రసాద్, కంపల్ల శ్రీనివాస్, సబ్ ఇన్​స్పెక్టర్లు చారీ రాంబాబు, డొంకల రాంబాబు, గౌతమ్ రెడ్డి, పి.సంతోష్ కుమార్, డి.రాజేశ్, కానిస్టేబుళ్లు కడరి హరిబాబు, ఏజీడీ మార్కస్ కు ఈ పురస్కారాలు దక్కాయి.

ఇక ఇన్వెస్టిగేషన్ విభాగంలో అడిషనల్ ఎస్పీ సంగరాంసింగ్ గణపతిరావు పాటిల్, డీఎస్పీ సత్యనారాయణ అడెపు, ఏసీపీ శ్రీధర్ రెడ్డి పులిమామిడి, ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీధర్ రెడ్డి మామిళ్లలకు పతకాలు దక్కాయి.