మెట్రో రైలులో కుప్పకూలి చనిపోయిన డాక్టర్

మెట్రో రైలులో కుప్పకూలి చనిపోయిన డాక్టర్

అతనో డాక్టర్.. చాలా చిన్న వయస్సు.. ఎంతోమందికి వైద్యం చేయాల్సిన వ్యక్తి.. ఇంతలోనే అనుకోని గుండెపోటు.. ప్రయాణిస్తున్న రైలులోను కుప్పకూలిపోయాడు.  తోటి ప్రయాణికులు సీపీఆర్ చేసినా.. సమీప ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు.. ఇటీవల కాలంలో గుండెపోటు అన్ని వయసుల వారితో ప్రాణాంతకంగా మారింది. గతంలో 40 ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే ఈ గుండె సంబంధిత వ్యాధి ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు అన్ని వర్గాల్లోనూ  హార్ట్ ఎటాక్ తో మరణించిన వారున్నారు. ఢిల్లీ మెట్రో లో ఓ డాక్టర్ ఉన్నట్టుంది గుండెపోటు రావడం ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందాడు.. వివరాల్లోకి వెళితే.. 

హర్యానాకు చెందిన మయాంక్ గర్గ్.. మహారాష్ట్రలోని వార్థాలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఎగ్జామ్స్ రాసేందుకు పంచకుల వెళ్తున్నాడు. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్ర స్టేషన్ సమీపంలో మెట్రో రైలులో గుండెపోటుతో మృతిచెందాడు.. రైల్లో ఉండగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలాడు.. గుండెపోటు వచ్చిందని గమనించిన తోటి ప్రయాణికుల్లో ఒకరు CPR నిర్వహించినప్పటికీ ఫలితం లేదు.. సృహ కోల్పోయి ఉన్న మయాంక్ ఢిల్లీలో ఓ ఆస్పత్రికి తరలించారు ఢిల్లీ మెట్రో అధికారులు.. అయితే ఈలోపే మయాంక్ మృతిచెందాడు. 

ముఖ్యమంగా ఈ మూడు నాలుగు ఏళ్లలో గుండెజబ్బులు అన్ని వర్గాల్లో పెరిగాయి.మారుతున్న వాతావరణ, తింటున్న ఆహారం, జీవన శైలీలో మార్పులు చిన్నల నుంచి పెద్దల వరకు గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారని కొందరి వాదన.. మరికొందరు కరోనా తర్వాత వచ్చిన పరిస్థితులు, చికిత్స పర్యవసానమే మరికొందరు అంటున్నారు. ఏదీ ఏమైనా చిన్న వయసులో గుండె జబ్బుల బారిన పడటం చాలా ఆందోళన కలిగించే విషయం.