లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఒకే ఊరికి చెందిన 26 మంది యువకులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కసంపూర్ ఖోలా విలేజ్‌కు చెందిన యువకులు ఇటీవల జరిగిన ఎగ్జామ్‌ను క్రాక్ చేసి ఉద్యోగాలు సాధించారు. ఈ ఒక్క గ్రామం నుంచే 70మంది పోటీపడగా 26 మంది సక్సెస్ సాధించారని అధికారులు చెప్పారు. యూట్యూబ్ ట్యుటోరియల్స్‌లో క్లాసులు వింటూ ప్రిపేర్ అయ్యామని వారు చెప్పారు. స్టడీ మెటీరియల్స్ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్ లను వినియోగించడం తమ సక్సెస్‌కు తోడ్పడిందన్నారు. మారుమూల పల్లె నుంచి ఇంత మంది యువకులు ఉద్యోగాలు సాధించడం చుట్టుపక్కల గ్రామాలకు స్ఫూర్తిగా నిలిచింది.