ఒడిశాలో జూన్ 2న రాత్రి జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 261కి చేరిందని రైల్వే అధికారులు ప్రకటించారు. 900 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని గోపాల్‌పూర్, ఖంతపరా, బాలాసోర్, భద్రక్,సోరో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలం దగ్గర రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని..పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు రైల్వే అధికారులు.
కాసేపటి క్రితం ప్రమాదంపై అత్యున్న స్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ కాసేపట్లో ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ఇప్పటికే ఫ్లైట్ లో భువనేశ్వర్ బయల్దేరారు.మధ్యా హ్నం 2.30 గంటలకు మోడీ భువనేశ్వర్ చేరుకోనున్నారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇవాళ ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు.