పెద్దపల్లి, వెలుగు: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం రూ.26.49 కోట్లు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం పెద్దపల్లి స్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. రైల్వే అధికారులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్–తనుగుల గ్రామాల మధ్య లో లెవెల్ బ్రిడ్జిని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.4.5 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రామగుండం రీజనల్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గుప్తా, సంపత్ రావు, మల్లేశ్ పాల్గొన్నారు.