- నాలుగు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో 2,69,295 దరఖాస్తులు
- ఎక్కువ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకే
- ముగిసిన గ్రామసభలు
యాదాద్రి, నల్గొండ, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు స్కీమ్స్ అమలు కోసం నిర్వహించిన గ్రామ, వార్డు సభలు శుక్రవారం ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన ఈ సభల్లో పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చాయి. వీటిల్లో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసమే ఎక్కువగా దరఖాస్తులువచ్చాయి. ఇటీవల ప్రకటించిన జాబితాతోపాటు కొత్తగా స్వీకరించిన అప్లికేషన్లను ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు.
సభల్లో ఆయా స్కీమ్స్‌ల జాబితాలోని పేర్లను ఆఫీసర్లు చదివే సమయంలో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఆఫీసర్లు ఓపికగా విని సమాధానం చెప్పారు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లయ్ చేసుకున్నాం. లీస్ట్‌లో పేరు రాలే' అంటూ గ్రామసభల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో తిరిగి అప్లయ్చేసుకోవాలని అధికారులు సూచించారు.
యాదాద్రిలో 74,614 అప్లికేషన్లు..
యాదాద్రి జిల్లాలో గతేడాది నిర్వహించిన ప్రజాపాలనలో 2,64,922 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో ఒక్కొక్కరు రేషన్‌కార్డులు, డబుల్ బెడ్రూం, గృహజ్యోతి, గ్యాస్‌సబ్సిడీ కోసం టిక్‌లు పెట్టారు. వీటిలో గృహజ్యోతి, గ్యాస్ సబ్సిడీ ఇప్పటికే అందుతున్నాయి. అయితే ఇటీవల రేషన్‌కార్డుల కోసం అప్లికేషన్చేసుకున్న వారిలో 70,894 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లయ్ చేసుకున్న వారిలో 79,361 కుటుంబాలను అర్హులుగా గుర్తించారు.
ఈ జాబితాలను నాలుగు రోజులుగా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో అధికారులు చదివి విన్పించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేర్లు లేనివారు నిరాశ పడ్డారు. దీంతో మళ్లీ అప్లయ్చేసుకోవాలని ఆఫీసర్లు సూచించడంతో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా స్కీమ్స్ కోసం 74,614 మంది అప్లయ్ చేసుకున్నారు.
సూర్యాపేటలో 77,037..
సూర్యాపేట జిల్లాలో గ్రామ, వార్డు సభల్లో మొత్తం 77,037 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 21న రైతుభరోసా 407, ఆత్మీయ భరోసా 4,600, ఇందిరమ్మ ఇండ్లు 5,135, రేషన్‌కార్డులు 4,897, 22న రైతుభరోసా 630, ఆత్మీయ భరోసా 5,540, ఇందిరమ్మ ఇండ్లు 7,166, రేషన్‌కార్డులు 5,356, ఈనెల 23న రైతుభరోసా 978, ఆత్మీయ భరోసా 6,548, ఇందిరమ్మ ఇండ్లు 7,164, రేషన్‌కార్డులు 6,530, ఈనెల 24న రైతుభరోసా 813, ఆత్మీయ భరోసా 5,498, ఇందిరమ్మ ఇండ్లు 8,760, రేషన్‌కార్డులు 7,015 మొత్తంగా రైతుభరోసా 2,828, ఆత్మీయ భరోసా 22,186, ఇందిరమ్మ ఇండ్లు 28,225, రేషన్‌కార్డులు 23,798 దరఖాస్తులు వచ్చాయి.
నల్గొండ జిల్లాలో 1,17,644..
నల్గొండ జిల్లాలో గ్రామ, వార్డు సభల్లో రైతుభరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల కోసం మొత్తం 1,17,644. దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 21న ఇందిరమ్మ ఇండ్లు 8,029, రేషన్ కార్డులు 10,500, ఈనెల 22న రైతుభరోసా 630, ఆత్మీయ భరోసా 5,540, ఇందిరమ్మ ఇండ్లు 7,166, రేషన్‌కార్డులు 5,356, ఈనెల 23న రైతుభరోసా 288, ఆత్మీయ భరోసా 346, ఇందిరమ్మ ఇండ్లు 12,227, రేషన్‌కార్డులు 13,921, 24న రైతుభరోసా 543, ఆత్మీయ భరోసా 14,641, ఇందిరమ్మ ఇండ్లు 13,910, రేషన్‌కార్డులు 13,610 మొత్తంగా రైతుభరోసా 844, ఆత్మీయ భరోసా 15,485, ఇందిరమ్మ ఇండ్లు 47,471, రేషన్‌కార్డులు 53,844 దరఖాస్తులు వచ్చాయి.