ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో తొక్కిసలాట.. 27 మంది భక్తులు మృతి

ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో తొక్కిసలాట.. 27 మంది భక్తులు మృతి

యూపీలోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో 25 మంది చనిపోయారు. మంగళవారం (జూలై2, 2024) రతీభాన్ పూర్ లో సత్సంగ్( మతపరమైన కార్యక్రమం) జరిగింది. కార్యక్రమం ముగియగానే జరిగిన తొక్కిసలాటలో 25 మంది మహిళలతో సహా ఇద్దరు పురుషులు 27 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు  మహిళలు, పిల్లలు గాయపడ్డారు. గాయపడిన 15 మంది మహిళలు, పిల్లలను ఎటా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చూడాలని యోగీ ఆదిత్యా నాథ్ అధికారులను ఆదేశించారు.

సీఎంవో ఇటా ఉమేష్ కుమార్ త్రి పాఠి తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్  జిల్లాలో మంగళవారం సత్సంగ్ (మతపరమైన కార్యక్రమం) లో జరిగిన భారీ తొక్కిసలాటలో 27 మంది మృతిచెందారు. సికిందర్ రావు పోలీస్ స్టేషన్  పరిధిలోని రతీభాన్ పూర్ గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటివరకు 27 మంది మృతదేహాలను పోస్ట్ మార్ట్ కు తరలించాం.. ఇంకా కొంతమంది ఈ తొక్కిసలాటలో గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించాం.. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నాం.. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామని ఇటాహ్ ఎస్ ఎస్పీ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.