
- పేట్ బషీరాబాద్
- లేడీస్ హాస్టల్లో ఘటన
జీడిమెట్ల, వెలుగు: ప్రేమించిన వ్యక్తి పెండ్లి చేసుకోకపోవడంతో పేట్ బషీరాబాద్పరిధిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల్‌జిల్లా ఇమాంపూర్‌కు చెందిన తులసిరెడ్డి కూతురు కండెల ప్రియాంక (27) ఎంబీఏ పూర్తి చేసి సిటీలో జాబ్చేస్తుంది. అందులో భాగంగా సుచిత్రలోని వెన్నెలగడ్డలో ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. అయితే, నగరానికి చెందిన బంకురు అప్పలనాయుడు కొడుకు రవికుమార్, ప్రియాంక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
రవికుమార్ ప్రేమించి పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత పెండ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ప్రియాంక సోమవారం ఉదయం హాస్టల్‌గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఈ ఘటనపై పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.