హైదరాబాద్, వెలుగు: తాజాగా నిర్వహించిన ప్రాపర్టీ షోలో 30 వేల మంది పార్టిసిపేట్ చేశారని క్రెడాయ్ హైదరాబాద్ ప్రకటించింది. రూ.270 కోట్ల కంటే ఎక్కువ బిజినెస్ జరిగిందని పేర్కొంది. గత రెండు రోజుల్లో 212 సైట్లను ప్రాపర్టీ షోలో పాల్గొన్నవారు విజిట్ చేశారని తెలిపింది. సుమారు 4,12,009 చదరపు అడుగుల ప్రాపర్టీ స్పేస్‌ను, హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న వివిధ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను క్రెడాయ్ హైదరాబాద్ ప్రదర్శనకు ఉంచింది.
కాగా, ఈ నెల 2,3,4 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్రాపర్టీ షోని నిర్వహించారు. ఈ నెలలోనే 9,10,11 తేదీల్లో కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌లో మరోసారి ప్రాపర్టీ షోని నిర్వహించనున్నారు.