రాష్ట్రంలో 5 రోజుల్లో 270 మరణాలు

రాష్ట్రంలో 5 రోజుల్లో 270 మరణాలు
  • రాష్ట్రంలో ఆగని కరోనా మృత్యుఘోష.. కొత్తగా 7,754 కేసులు నమోదు
  • ఐదో రోజూ యాభై మందికి పైగా మృతి
  • ఇక ఒక్కో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 50 మందికే టెస్టులు
  • కిట్ల కొరతతో సర్కారు ఆదేశాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ర్టంలో కరోనా మృత్యుఘోష ఆగట్లేదు. 5 రోజుల నుంచి రోజూ 50కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం నుంచి గురువారం వరకూ 219 మంది చనిపోగా శుక్రవారం మరో 51 మంది చనిపోయినట్టు హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ర్టంలో కరోనా మరణాల సంఖ్య 2,312కు చేరింది. టెస్టులు తగ్గించడంతో కేసులు కూడా తగ్గాయి. శుక్రవారం ప్రభుత్వ సెంటర్లలో 55,853 మందికి టెస్టులు చేయగా, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌లో 22,077 మంది టెస్టు చేయించుకున్నారు. ఈ మొత్తం 77,930 మందిలో 7,754 మందికి పాజిటివ్‌‌‌‌‌‌‌‌ వచ్చినట్టు బులిటిన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. అంటే టెస్టు చేయించుకున్న ప్రతి వందలో 10 మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ 7,754 కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 1,507, జిల్లాల్లో 6,247 కేసులు వచ్చినట్టు చూపించారు. మరోవైపు కిట్ల కొరతతో టెస్టుల సంఖ్యను మరింత తగ్గించాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోజుకు 50 మందికే టెస్ట్ చేయాలని హెల్త్ ఆఫీసర్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

యాక్టివ్‌‌‌‌‌‌‌‌ కేసులు 78,888 
రాష్ర్టంలో కరోనా యాక్టివ్ పేషెంట్ల సంఖ్య 78,888కి చేరింది. ఇందులో 55,046 మంది హోమ్‌‌‌‌‌‌‌‌ ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉండగా 23,842 మంది ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇందులో 6,862 మంది వెంటిలేటర్ పై, 11,671 మంది ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌పై ఉన్నట్టు డ్యాష్‌‌‌‌‌‌‌‌ బోర్డులో పేర్కొన్నారు. ఇంకో 3,057 వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్లు, 6,558 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నట్టు చూపించారు. కానీ హాస్పిటళ్లలో అసలు ఒక్క బెడ్డు కూడా ఖాళీగా లేదని డాక్టర్లు చెబుతున్నారు. గాంధీ, టిమ్స్‌‌‌‌‌‌‌‌, నిమ్స్‌‌‌‌‌‌‌‌, కింగ్‌‌‌‌‌‌‌‌ కోఠి, చెస్ట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ సహా కరోనా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కేరాఫ్‌‌‌‌‌‌‌‌గా ఉన్న అన్ని సర్కార్, ప్రైవేట్ దవాఖాన్లలో ఐసీయూ బెడ్లు నిండిపోయాయి. ఆఖరికి ఎర్రగడ్డలోని మెంటల్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో కూడా బెడ్లు ఖాళీగా లేవు. అక్కడ 75 బెడ్లు కరోనా పేషెంట్ల కోసం కేటాయిస్తే అన్నీ నిండిపోయాయి. బెడ్ల కోసం తిరుగుతూ కరోనా రోగులు అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ల్లోనే చనిపోతుండగా వేల సంఖ్యలో బెడ్లు ఖాళీగా ఉన్నట్టు సర్కారు ప్రకటిస్తోంది.

జూపార్కులు క్లోజ్‌‌‌‌‌‌‌‌
కరోనా తీవ్రత పెరుగుతుండటంతో రాష్ర్టంలోని జూపార్కులు, పులుల అభయారణ్యాలు, నేషనల్ పార్కులను మూసివేస్తున్నట్టు అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రకటించారు. కేంద్ర పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మంత్రి ఆదేశాలతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌‌‌‌‌‌‌‌, వరంగల్ కాకతీయ జూపార్కులను మూసేస్తూ పీసీసీఎఫ్ శోభ ఉత్తర్వులు జారీ చేశారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ లు, రక్షిత అటవీ ప్రాంతాల మూసివేయనున్నట్లు ప్రకటించారు. వీటిల్లో సందర్శకులకు అనుమతి నిలిపివేస్తున్నామని తెలిపారు. కేబీఆర్ పార్కును కూడా క్లోజ్ చేస్తున్నట్టు శోభ తెలిపారు.