24 గంటల్లో 27,114 కేసులు.. 519 మరణాలు

24 గంటల్లో 27,114 కేసులు.. 519 మరణాలు
  • 8.2లక్షలకు చేరిన కేసుల సంఖ్య
  • ప్రపంచవ్యాప్తంగా 1.24 కోట్లకు చేరిన కేసులు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకి కొత్త రికార్డు నమోదవుతుంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 27,114 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 8,20,916కి చేరింది. 519 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 22,123కి చేరింది. 2,83,407 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 5,15,386 మంది డిశ్చార్జ్‌ అయ్యారని కేంద్రం తెలిపింది. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, యూపీ, వెస్ట్‌బెంగాల్‌లో కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నెల 10వ తారీఖు వరకు 1.13కోట్ల శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్లు ఐసీఎమ్‌ఆర్‌‌ ప్రకటించింది. వాటిలో శుక్రవారం ఒక్కరోజే 2,82,511 శ్యాంపిల్స్‌ టెస్ట్‌ చేశారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 1,24,61,962కి చేరింది. వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు 5,59,481 మంది చనిపోయారు. 68,35,987 మంది రికవరీ అయ్యారు. యూఎస్‌లో శుక్రవారం ఒక్కరోజే 69వేల కేసుల నమోదయ్యాయి.