గాంధీ హాస్పిటల్​లో మరో 28 సీసీ కెమెరాలు

గాంధీ హాస్పిటల్​లో మరో 28 సీసీ కెమెరాలు

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్​లో కొత్తగా మరో 28 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.  వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్​లో సూపరింటెండెంట్ ప్రొ. రాజకుమారి సోమవారం ప్రారంభించారు. ఇప్పటి వరకు వీటిని కలుపుకొని మొత్తం 148 సీసీ కెమెరాలు పనిచేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. హాస్పిటల్​ ఆవరణలో జరిగే అవాంఛనీయ సంఘటనలు, నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి సీఐ అనుదీప్ డిప్యూటీ సూపరింటెండెంట్ డా. కే సునీల్ కుమార్, ఆర్​ఎమ్​ఓ వన్​ డా. శేషాద్రి, సిబ్బంది పాల్గొన్నారు.