
‘పొలిమేర’ ఫ్రాంచైజీతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్నాడు అనిల్ విశ్వనాథ్. అయితే ‘పొలిమేర’ కంటే ముందు ఆయన రూపొందించిన చిత్రం ‘28 డిగ్రీస్ సెల్సియస్’. నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా నటించగా, సాయి అభిషేక్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘ఇది నా మొదటి సినిమా కావడంతో నాకొక ఎమోషనల్ కనెక్షన్ ఉంది.
స్క్రిప్ట్‌ను బాగా లవ్ చేశాను. 2017లోనే సినిమా స్టార్ట్ చేశాం. ఫారిన్ షెడ్యూల్స్‌తో క్వాలిటీ పరంగా రాజీ పడకుండా తీశాం. 2020 మేలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. ఈలోపు లాక్‌డౌన్ వచ్చి సినిమా ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఓటీటీ ఆఫర్స్ వచ్చినా ఇవ్వలేదు. ఇప్పుడు నా ఫ్రెండ్ వంశీ నందిపాటి సపోర్ట్‌తో రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. థ్రిల్లింగ్‌తో పాటు సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో హీరోయిన్ ఓ విచిత్ర సమస్య ఫేస్ చేస్తుంటుంది.
28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువైనా, తక్కువైనా తట్టుకోలేని స్థితిలో ఉంటుంది. ఇలాంటి యూనిక్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథలో నవీన్ చంద్ర, షాలిని పెర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పొలిమేర సిరీస్‌లో థర్డ్ పార్ట్ చేస్తున్నా. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇందులో ఓ స్టార్ హీరో కీలక పాత్రలో నటిస్తారు. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నా’ అని చెప్పాడు.