
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ గడువు పూర్తయిన 28 ప్రైవేట్ ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి పర్మిషన్రద్దు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్దురిశెట్టి వైద్యాధికారులను ఆదేశించారు. అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్లకు మొదటి విడతగా రూ.50 వేల ఫైన్ విధించి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి క్లినికల్ ఎస్టాబ్లిషమెంట్ యాక్ట్ సమావేశములో చైర్మన్ హోదాలో కలెక్టర్పాల్గొన్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లు, క్లినిక్లు, వెల్నెస్ సెంటర్లు, ఫిజియోథెరపీ సెంటర్లు, డెంటల్ క్లినిక్ లు, ఎక్స్రే క్లినిక్, అలోపతి, ఆయుష్ క్లినిక్ లు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని తెలిపారు.