- ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
- కరీంనగర్‌లో 15 మంది..
- పెద్దపల్లిలో26 మంది ఇండిపెండెట్లు
కరీంనగర్ /పెద్దపల్లి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఇండిపెండెంట్లు డాక్టర్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి, ఎండీ జీషన్, పచ్చిమట్ల రవీందర్, పిడిశెట్టి రాజు, రాజ్యాధికార పార్టీ అభ్యర్థి ఆరెల్లి సుమలత తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు.
మొత్తం 53 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 20 మంది నామినేషన్లు రిజెక్టయ్యాయి. 33 మంది అభ్యర్థుల్లో సోమవారం ఐదుగురు విత్ డ్రా కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో సహా మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో 49 మంది నామినేషన్లు అప్రూవ్ కాగా, సోమవారం ఏడుగురు విత్ డ్రా చేసుకోవడంతో 42 మంది బరిలో నిలిచారు. కరీంనగర్, పెద్దపల్లిలో అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తయింది.
పెద్దపల్లి బరిలో అభ్యర్థులు వీరే..
పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీఎస్పీ నుంచి ఎరుకుల్ల రాజనర్సయ్య తోపాటు ఇరుగురాల భాగ్యలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), ఎ.సుమలత(అలయెన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ పార్టీ), కనకయ్య ముల్కల(సోషలిస్టు పార్టీ(ఇండియా), కాశీ సతీశ్ కుమార్(యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ), కంది చందు(రాష్ట్రీయ మానవ్ పార్టీ), చిలుక ఆనంద్(యువతరం పార్టీ), దుర్గం సంతోష్(ప్రజా రాజ్య సమితి), రామచందర్ నిచకోల(దళిత బహుజన పార్టీ), మొలుగు వెంకటేష్(న్యూ ఇండియా పార్టీ), మోతె నరేష్(పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా), రమేష్ మంద (ధర్మ సమాజ్ పార్టీ) మొయ్యి వేణుగోపాల్(బహుజన్ ముక్తి పార్టీ) పోటీలో ఉన్నారు. మరో 26 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా బరిలో నిలిచారు.
కరీంనగర్ లోక్‌సభ స్థానంలో 28 మంది..
కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బండి సంజయ్, కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ తరఫున బి.వినోద్ కుమార్, బీఎస్పీ తరఫున మారెపల్లి మొగిలయ్య బరిలో నిలిచారు. అలాగే అనిల్ రెడ్డి కడ్తాల(నేషనల్ నవక్రాంతి పార్టీ), అరుణ తాళ్లపల్లి(అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ పార్టీ), అశోక్ పంచిక(సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా), చింత అనిల్ కుమార్(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), చిలువేరు శ్రీకాంత్(ధర్మ సమాజ్ పార్టీ), చీకోటి వరుణ్ కుమార్ గుప్తా(తెలుగు కాంగ్రెస్ పార్టీ), పొడిశెట్టి సమ్మయ్య(బహుజన్ ముక్తి పార్టీ), రాణాప్రతాప్(సోషలిస్ట్ పార్టీ - ఇండియా), శ్రావణ్ పెద్దప్లి(భారతీయ యువకుల దళం)తోపాటు మరో 15 మంది పోటీలో ఉన్నారు.